నిర్మల్ జిల్లా ఎమ్మెల్యే రామరావ్ పటేల్ శుక్రవారం దినమంతా బిజీ బిజీగా గడిపారు. ఒకే రోజు పది గ్రామాల్లో పర్యటించి, అనేక ప్రభుత్వ, సామాజిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ప్రజలతో మమేకమవుతూ ప్రజాసేవకు ప్రతిబింబంగా నిలిచారు..
లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బ్రహ్మేశ్వరంలో గోశాల ప్రారంభించి పశుసంరక్షణపై అవగాహన కల్పించారు. పార్డి మరియు బీ టాక్లి గ్రామాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులతో సమావేశమై వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.
పల్సి గ్రామంలో ముత్యాలమ్మ, పోచమ్మ, మహాలక్ష్మి దేవతల విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. బెల్గాం, కుబీర్, హంపోలీ గ్రామాల్లో జరిగిన గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరై, కొత్త ఇళ్లలో ప్రవేశించిన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తదుపరి, బాసరలో జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని సన్మానించి ఆమె భవిష్యత్తుకు ఆశీర్వచనాలు అందించారు. చివరిగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ జిల్లా కార్యశాల సమావేశానికి హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రజల్లో నిత్యం మమేకమవుతూ, ప్రభుత్వ, సామాజిక, పార్టీ కార్యక్రమాల్లో సమంగా పాల్గొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న రామన్న పాలన ఇది అని పార్టీ కార్యకర్తలు పేర్కొన్నారు.
Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533








