V1News Telangana

best news portal development company in india

వానను కాదు… రైతులను కాపాడతాం!” – తహసిల్దార్ సర్పరాజ్ ధీమా . “ప్రతి గింజను రాష్ట్రమే కొంటుంది!” – ధాన్యం పై రైతులకు భరోసా… వానకు తడిసిన వరి ధాన్యం పై సర్కార్ స్పష్టత – తహసిల్దార్ దూకుడు… “ధైర్యం రైతో… ప్రభుత్వం నీతో!” – లోకేశ్వరం లో అధికారుల పర్యటన…. ధాన్యం ఎన్ని తడిచిన కొంటాం! – కలెక్టర్ ఆదేశాలకు తహసిల్దార్ చర్యలు….

SHARE:

ధైర్యం రైతో… ప్రభుత్వం నీతో!”

నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలంలోని పలు గ్రామాల్లో ఎడతెగకుండా కురిసిన వర్షాలతో వరి ధాన్యం తడిసిపోయినా, రైతులు ఒక్క క్షణం కూడా ఆందోళన చెందవద్దని తహసిల్దార్ సర్పరాజ్ భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తహసిల్దార్ స్వయంగా ఐకెపి, పిఏసిఎస్ ధాన్యం సెంటర్లను తనిఖీ చేసి, తడిసిన ధాన్యం సహా మిగిలిపోయిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని చర్యలు ప్రారంభించారు.

ధాన్యం మిల్లర్లతో కలెక్టర్ చర్చలు జరిపి, కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ, “ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు ఏమాత్రం భయపడకండి” అని స్పష్టం చేశారు.

Oplus_16908288

ఈ కార్యక్రమంలో రైతులతో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వీఆర్ఏ రాజేశ్వర్, విలాస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india