V1News Telangana

best news portal development company in india

భైంసాలో మట్కా జూదరులపై ఆకస్మిక దాడులు – పలువురు అరెస్ట్… మట్కా కేసులో 1600 రూపాయలు, సెల్ ఫోన్లు స్వాధీనం – నిందితులపై కేసు నమోదు…. . 326 సెక్షన్ కేసులో ముగ్గురికి ఏడాది కఠిన కారాగారం – జెఎఫ్‌సిఎం కోర్టు తీర్పు.. భైంసా టౌన్ పోలీసుల దాడుల్లో మట్కా ముఠా బట్టబయలు… . జేఎఫ్‌సిఎం కోర్టులో 2019 క్రిమినల్ కేసులో ముగ్గురు దోషులుగా తేలిన నిందితులు…

SHARE:

భైంసా టౌన్, నిర్మల్ జిల్లా:

భైంసా టౌన్ సీఐ జి. గోపీనాథ్ సార్ తెలిపిన వివరాల ప్రకారం, నమ్మదగిన సమాచారం మేరకు పోలీసు దళాలు ఈ రోజు ఆకస్మికంగా జరిపిన దాడుల్లో పలువురు మట్కా జూదరులు పట్టుబడ్డారు. వారి నుండి రూ.1600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు వర్గాలు తెలిపిన మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలయ్యింది. కాగా, ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.ఇదే సమయంలో, 2019లో నమోదైన క్రిమినల్ కేసు (Cr.No.12/2019) పై జెఎఫ్‌సిఎం కోర్టు భైంసాలో ఈ రోజు తీర్పు వెలువరించింది. కేసు నంబరు 160/2020. సెక్షన్ 326 r/w 34 IPC కింద నిందితులపై విచారణ జరిపి, నిందితులు షేక్ మైతాబ్, సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్‌లను ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అదనంగా, ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే, మరో నెల సాదాసీదా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

ఈ కేసులో న్యాయమూర్తి శ్రీ డి. దేవేంద్ర బాబు గారు తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా శ్రీ బి. అరుణ గారు, విచారణాధికారులు ఏఎస్ఐ బి. సుదర్శన్ మరియు ఎస్ఐ కె. విష్ణు ప్రకాష్ గారు పని చేశారు. సీడీఓగా ఎస్. మాణిక్ రావు (PC 538) ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india