May 23, 2026 5:14 am

V1News Telangana

సలాంపాడు చుట్టూ పక్కల చెలరేగిన పేకాట స్థావరలు – అధికారుల మౌనంపై ప్రజల్లో ఆగ్రహం…. అధికారుల పాలె గుడ్లగూబలా?… చిన్న స్థావరాలపై నాటకాలు – ప్రధాన స్థావరంపై నిశ్శబ్దం!… పాలకుల అండదండలే కారణమా?… ప్రజల్లో ఆగ్రహం – పైస్థాయి అధికారుల హస్త అవసరం…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలంపాడ్ , ఏప్రిల్ 25:
సాలంపాడ్ చుట్టూ పక్కల ప్రాంతంలో భారీ స్థాయిలో కొనసాగుతున్న పేకాట స్థావరల పై అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గత కొద్ది నెలలుగా ఈ స్థావరల పై ప్రజల దృష్టికి వచ్చినప్పటికీ, అధికారులు మాత్రం కళ్లారిపోతున్నారు. ఇది స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది.

ప్రతి రోజు రాత్రి పేకాట ఆటగాళ్లతో ఉరిమే ఈ స్థావరం వెనుక అధికారుల అండదండలున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం, పేకాట నిర్వాహకులు ముందుగానే కొందరు అధికారులతో కుమ్మక్కై స్థావరం పై దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఇకపోతే, చిన్నపాటి పేకాట స్థావరాలపై దాడులు చేసి నామమాత్రంగా కేసులు నమోదు చేయడం ద్వారా అధికారులు ప్రజలను మభ్యపెడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “చిన్న స్థావరాలపై చూపించిన చొరవను, ఈ ప్రధాన స్థావరంపై ఎందుకు చూపించలేకపోతున్నారు?” అనే ప్రశ్నలకు అధికారుల సమాధానం లేదు.

ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశంపై నిశ్శబ్దం పాటిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. రాజకీయ ఆరాధన, సంబంధాలు ఈ స్థావరల పై దాడులకు అడ్డంకిగా మారాయన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి.

“ఇకనైనా పైస్థాయి అధికారులు స్పందించి, పేకాట స్థావరల పై కఠిన చర్యలు తీసుకోవాలి” అని ప్రజలు కోరుతున్నారు. నిషేధితమైన పేకాట ఆటల వల్ల యువత మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారని వారు హెచ్చరిస్తున్నారు.

అధికారుల పాలె గుడ్లగూబలా?

ప్రజల్లో వినిపిస్తున్నదేమంటే – ఈ స్థావరల పై అధికారులు ఏం జరుగుతుందో ముందుగానే తెలిసినా, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. స్థానికంగా చర్చ జరుగుతుండటమేకాదు, సామాజిక మాధ్యమాల్లోనూ ఈ స్థావరల గురించి హల్‌చల్ సాగుతోంది. అయినా సరే, సంబంధిత పోలీస్, శాఖలు మాత్రం దీని గురించి నోరు విపించడంలేదు. ఇది కేవలం తెలియదనడమేనా? లేక… ముందుగానే ఎవరితోనైనా ‘అనుమతి’ తీసుకున్నారా?

చిన్న స్థావరాలపై నాటకాలు – ప్రధాన స్థావరంపై నిశ్శబ్దం!

ఇదే సమయంలో, ఇతర ప్రాంతాల్లో చిన్న పేకాట స్థావరాలపై అధికారులు దాడులు చేసి ప్రజలకు చూపిస్తుండటం మరింత అనుమానాలను కలిగిస్తోంది. “చెట్టు మీద కూర్చున్న పక్షిని వదిలేసి, మట్టి మీద ఉన్నదానిని పట్టడం ఎందుకు?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం నాటకమా? లేక ప్రతిష్టాత్మక స్థావరాన్ని రక్షించే ప్రయత్నమా?

పాలకుల అండదండలే కారణమా?

పేకాట స్థావరల నిర్వాహకులు కొంతకాలంగా స్థానిక రాజకీయ నాయకులు, అధికారులతో స్నేహపూరితంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. స్థావరంపై దాడులు జరగకుండానే ముందస్తు ములాకాత్లు ఏర్పాటు చేసుకుని, పరిష్కార మార్గాలు వేసుకున్నట్లు వినికిడి. ఈ స్థావరాల న్ని ఏవిధంగా చూసినా, దీని వెనకున్న అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రజల్లో ఆగ్రహం – పైస్థాయి అధికారుల హస్త అవసరం…

ఈ పరిస్థితుల్లో, స్థానికుల ఆగ్రహం రోజురోజుకూ పెరుగుతోంది. “ఇది సామాన్యుల బాధల విషయమైతే ఎప్పుడో చర్య తీసుకునేవారు. కానీ దీని వెనక బలమైన వ్యక్తులున్నారని అధికారుల మౌనం చెబుతోంది” అంటూ పలువురు పౌరులు స్పందిస్తున్నారు.

ఇకనైనా పైస్థాయి అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తునకు ఆదేశించాలని ప్రజలు కోరుతున్నారు. “పేకాట ముసుగులో నేరాలకు తలదాలుస్తున్న పరిస్థితిని అడ్డుకోవాలంటే, రాజకీయ హస్తక్షేపం లేకుండా చట్టం పని చేయాలి” అని స్పష్టం చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more