May 23, 2026 5:16 am

V1News Telangana

నిజామాబాద్ లో హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు…. శోభాయాత్ర ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య… . శాంతియుతంగా జరగాలంటూ ప్రజలకు కమిషనర్ సూచనలు…. . 225 CC కెమెరాలతో నిఘా: కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి శోభాయాత్రపై పర్యవేక్షణ….

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ , ఏప్రిల్ 12: నిజామాబాద్ నగరంలో నేడు నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రను పురస్కరించుకొని పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. నీలకంఠేశ్వర్ ఆలయం నుండి RR చౌరస్తా వరకు ఈ శోభాయాత్ర కొనసాగిన సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, సాంకేతిక పర్యవేక్షణతో పాటు, 225 CC కెమెరాల సహాయంతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి శోభాయాత్రను జాగ్రత్తగా నిఘా నిర్వహించారు. ఏ ప్రాంతంలోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, “ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని, ఎలాంటి రూమర్లను నమ్మవద్దని” తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా ఎటువంటి శాంతిభంగం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటారని వెల్లడించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more