V1News Telangana

best news portal development company in india

సింగరేణి భూముల్లో ఎర్రమట్టి తవ్వకాలు పట్టించుకోని సింగరేణి అధికారులు నిఘా నేత్రాలు  /// ఇటుక బట్టి నిర్వాహకులు ఎర్రమట్టి తవ్వకాలు తూతూ మంత్రంగా చర్యలు

SHARE:

సింగరేణి భూముల్లో ఎర్రమట్టి తవ్వకాలు పట్టించుకోని సింగరేణి అధికారులు నిఘా నేత్రాలు

ఇటుక బట్టి నిర్వాహకులు ఎర్రమట్టి తవ్వకాలు తూతూ మంత్రంగా చర్యలు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం ఏప్రిల్ 11:ఎ

రామగుండం పరిధిలో 2ఏ గని నుండి ముత్యాల సుందిళ్ల పోయే దారిలో ఉన్న సింగరేణి స్థలాలలో అక్రమంగా ఎర్ర మట్టి తవ్వకాలు జరుగుతుందని సింగరేణి అధికారులకు తెలిసినప్పటికీ వాటిపై చర్యలు శూన్యం గత కొంతకాలంగ గుట్టు చప్పుడు కాకుండా ఎర్ర మట్టి తవ్వకాలు జరుగుతున్న కనీసం సింగరేణి నిఘా నేత్రాలు అధికారులు అటువైపు కూడా చూడకపోవడం ప్రశ్నార్థకం. సింగరేణి నిఘా నేత్రానికి సమాచారం ఉన్నప్పటికీ దీనిపై చర్యలు తీసుకోకపోవడం అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. ముత్యాల సుందిళ్ల గ్రామంలో పదుల సంఖ్యలో ఇటుక బట్టీలు ఉన్నాయి ఆ ఏరియా వైపు కనీసం సింగరేణి నిఘ లేకపోవడంతో రాత్రివేళలో ఎర్ర మట్టి తవ్వకాలు జరిపి ఇటుక బట్టీలకు పంపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఇప్పటికైనా సింగరేణి ఉన్నతాధికారులు స్పందించి ఎర్రమట్టి తవ్వకాలపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india