భైంసా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటాం: ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్
భైంసా: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో భైంసా మున్సిపల్ పీఠాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని భాజపా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం భైంసాలోని ఎస్.ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీలో జరిగిన బీజేపీ పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “రెండు పార్లమెంటు స్థానాలతో ప్రారంభమైన బీజేపీ, 45 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగింది. బూత్ స్థాయి నుంచి నాయకుల ఎదుగుదల బీజేపీ బలాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో చాలా మంది బూత్ స్థాయి నుంచే ప్రారంభించారు. ప్రతి కార్యకర్త కూడ కలిసికట్టుగా పని చేస్తే, భవిష్యత్తులో మున్సిపల్ పీఠాన్ని ఖచ్చితంగా సాధించగలం,” అని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. బీజేపీలో బూత్ స్థాయి నేతలకు ప్రాధాన్యం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఇంచార్జి చిన్నారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎనుపోతుల మల్లేష్, మండల అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు తాలోడ్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








