-- --

“జైజైకారాల మధ్య గణనాథుడి సాగనంపు.. పసుపువాగులో ఘనంగా నిమజ్జనం”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

“గణపతి బప్పా మోరియా.. ఘనంగా గణనాథుల నిమబోధన్‌లో వైభవంగా గణనాథుల నిమజ్జన శోభాయాత్ర…

భక్తిశ్రద్ధలతో సాగిన శోభాయాత్ర.. పసుపువాగులో గణేశ విగ్రహాల నిమజ్జనం..

బోధన్, సెప్టెంబర్ 25:
బోధన్ పట్టణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం గణనాథుల నిమజ్జన శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ప్రధాన వీధుల మీదుగా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

బాజాభజంత్రీలు, కోలాటాలు, భక్తుల జైజైకారాలతో శోభాయాత్ర సాగింది. “గణపతి బప్పా మోరియా” అంటూ భక్తులు చేసిన నినాదాలతో పట్టణ వీధులు మార్మోగాయి. మహిళలు, చిన్నారులు, యువతతో పాటు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు వినాయక మండపాల నిర్వాహకులు గణేశ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి శోభాయాత్రలో తరలించారు.

అనంతరం శోభాయాత్ర రుద్రూర్ రోడ్డులోని పసుపువాగు వద్దకు చేరుకోగా, అక్కడ ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతంలో గణేశ విగ్రహాలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.

నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మరియు ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు. శోభాయాత్ర మార్గంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో విజయకుమారి, ఎమ్మార్వో విఠల్, ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ, ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి, వీడీసీ చైర్మన్ గంగాధర్ రావు పట్వారి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, పట్టణ సీఐ వెంకట నారాయణ, విద్యుత్ శాఖ ఏఈ నాయిని కృష్ణ, చక్రేశ్వర శివాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు లక్ష్మణ్ రావు పటేల్, మారుతీ మందిరం చైర్మన్ గుండేడి శంకర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దాము, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గోపి, సార్వజనిక్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పూజారి లింగం, సభ్యులు గుమ్ముల అశోక్ రెడ్డి, బీర్కూర్ బుజ్జి, బాలరాజ్, రుద్ర సత్యనారాయణ, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, శివాలయం కమిటీ సభ్యులు, మారుతీ మందిరం కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో బోధన్ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించడంతో నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more

గణేష్‌ నిమజ్జన బందోబస్తు వేళ.. అక్రమ ఇసుక రవాణా జోరా?..“శివుడి వెతుకులాట గణేశుడి కోసం.. రామలక్ష్మణుల వేట సీత కోసం.. అప్పటి వేట ధర్మం కోసం.. మరి నేటి రాత్రి వేట ఎవరి స్వార్థం కోసం?”