-- --

గణేష్ శోభాయాత్రను విజయవంతం చేయండి 25న ఏకచక్ర శివాలయం నుంచి గణనాథుని నిమజ్జన శోభాయాత్ర

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, సెప్టెంబర్ 24:
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఏకచక్ర శివాలయం ప్రాంగణంలో ప్రతిష్ఠించిన గణనాథుని నిమజ్జన శోభాయాత్రను ఈ నెల 25న అనంత చతుర్దశి సందర్భంగా ఘనంగా నిర్వహించనున్నట్లు బోధన్ సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పూజారి లింగం తెలిపారు.
గురువారం ఏకచక్ర శివాలయం ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 14న ఏకచక్ర శివాలయంలో బొజ్జ గణపయ్య విగ్రహ ప్రతిష్ఠాపన శోభాయమానంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
25న మధ్యాహ్నం 2 గంటలకు ఏకచక్ర శివాలయం నుంచి గణనాథుని నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. శోభాయాత్రకు ముందు మధ్యాహ్నం 1 గంట నుంచి భక్తులకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
నిమజ్జన శోభాయాత్రలో పట్టణ ప్రముఖులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పూజారి లింగం కోరారు.
ఈ సమావేశంలో శివాలయం కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్ రావు పటేల్, సార్వజనిక్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బీర్కూర్ బుజ్జి, మాసుల శ్రీనివాస్, గుమ్ముల అశోక్ రెడ్డి, బక్కన్న, కడికే శివ, రుద్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more

గణేష్‌ నిమజ్జన బందోబస్తు వేళ.. అక్రమ ఇసుక రవాణా జోరా?..“శివుడి వెతుకులాట గణేశుడి కోసం.. రామలక్ష్మణుల వేట సీత కోసం.. అప్పటి వేట ధర్మం కోసం.. మరి నేటి రాత్రి వేట ఎవరి స్వార్థం కోసం?”

Read more

గణేష్‌ నిమజ్జన బందోబస్తు వేళ.. అక్రమ ఇసుక రవాణా జోరా?..“శివుడి వెతుకులాట గణేశుడి కోసం.. రామలక్ష్మణుల వేట సీత కోసం.. అప్పటి వేట ధర్మం కోసం.. మరి నేటి రాత్రి వేట ఎవరి స్వార్థం కోసం?”