యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం అవసరం
భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత, విద్యార్థులు, మహిళలు ముందుకు సాగాలి: బి. మల్లేష్…
మోస్రా, సెప్టెంబర్ 26:
యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా, శాంతి, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ బోధన్ డివిజన్ కమిటీ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ అన్నారు.

నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భగత్‌సింగ్ జయంతి సందర్భంగా పీడీఎస్‌యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో శనివారం సదస్సు నిర్వహించారు. సదస్సుకు పీవోడబ్ల్యూ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షురాలు బి. నాగమణి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న బి. మల్లేష్ మాట్లాడుతూ.. అమెరికా ఆధిపత్య ధోరణులు, యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. భగత్‌సింగ్ చూపిన ధైర్యం, త్యాగం, సామాజిక మార్పు కోసం ఆయన సాగించిన పోరాట స్ఫూర్తిని యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా శాంతి, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ప్రజల ఐక్య పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత, విద్యార్థులు, మహిళలు సామాజిక సమస్యలపై చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పీవోడబ్ల్యూ నాయకులు సుజాత, శకుంతలతో పాటు మోస్రా ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం బి. సాయిలు, ఉపాధ్యాయుడు శేఖర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







