అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి
బోధన్, సెప్టెంబర్ 24:
వినాయక చవితి సందర్భంగా బోధన్ పట్టణంలోని తట్టికోట్ కాలనీలోని రెడ్డికా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి గురువారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శరత్ రెడ్డి, సీఐ వెంకటనారాయణ హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అతిథులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో రెడ్డికా సంఘం అధ్యక్షులు గుంత గంగాధర్, కార్యదర్శి ఆరుగొండ లక్ష్మణ్, ముజడం లింగం, బైరా లింగం, సీల లింగం, గణేష్ కమిటీ సభ్యులు అగ్గు గంగాధర్, పుర్మ సతీష్, శివ, శంకర్, రవి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








