-- --

మోకాన్‌పల్లిలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమాలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

తల్లులకు క్విజ్‌, వంటల పోటీలు.. చిన్నారులకు అన్నప్రాశన
మోకాన్‌పల్లి, సెప్టెంబర్ 24: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ మాసం–2026లో భాగంగా “మన అంగన్‌వాడీ–మన బాధ్యత” కార్యక్రమాన్ని మోకాన్‌పల్లి గ్రామపంచాయతీలో గురువారం నిర్వహించారు.
అంగన్‌వాడీ సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పిల్లల తల్లులు, గర్భిణులు, బాలింతలకు క్విజ్ పోటీలు, టీహెచ్‌ఆర్ బాలామృతంతో వంటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్యవంతమైన పిల్లల పోషణతో పాటు పోషకాహార లోపం ఉన్న చిన్నారులకు అందించాల్సిన ఆహారం, సరైన ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై తల్లులకు అవగాహన కల్పించారు. అలాగే సీబీ ఈవెంట్స్‌లో భాగంగా ఆరు నెలలు పూర్తి చేసుకున్న చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించారు. పోషణ మాసం ప్రాధాన్యతను తెలియజేస్తూ పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ వీరేష్, ఉపసర్పంచ్ టేకు సుదర్శన్ పాల్గొన్నారు. వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు, తల్లులు, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
పోషకాహారంపై కుటుంబ స్థాయిలో అవగాహన పెంపొందించి, ఆరోగ్యవంతమైన బాలల భవిష్యత్తుకు బాటలు వేయడమే పోషణ మాసం కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more

గణేష్‌ నిమజ్జన బందోబస్తు వేళ.. అక్రమ ఇసుక రవాణా జోరా?..“శివుడి వెతుకులాట గణేశుడి కోసం.. రామలక్ష్మణుల వేట సీత కోసం.. అప్పటి వేట ధర్మం కోసం.. మరి నేటి రాత్రి వేట ఎవరి స్వార్థం కోసం?”

Read more

గణేష్‌ నిమజ్జన బందోబస్తు వేళ.. అక్రమ ఇసుక రవాణా జోరా?..“శివుడి వెతుకులాట గణేశుడి కోసం.. రామలక్ష్మణుల వేట సీత కోసం.. అప్పటి వేట ధర్మం కోసం.. మరి నేటి రాత్రి వేట ఎవరి స్వార్థం కోసం?”