భక్తిశ్రద్ధలతో సాగిన ఊరేగింపు.. పసుపువాగులో గణేశ విగ్రహాల నిమజ్జనం…
V1 న్యూస్, బోధన్, సెప్టెంబర్ 22:
బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం గణనాథుల నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. రాకాసిపేటలోని భీమునిగుట్ట దేవాలయం వద్ద నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ప్రధాన వీధుల మీదుగా భక్తిశ్రద్ధల మధ్య కొనసాగింది.
పెద్ద సంఖ్యలో భక్తులు, పట్టణ ప్రజలు శోభాయాత్రలో పాల్గొని గణనాథుడికి జైజైకారాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. అనంతరం రుద్రూర్ రోడ్ వైపున ఉన్న పసుపువాగు వద్దకు శోభాయాత్ర చేరుకోగా, గణేశ విగ్రహాలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భక్తులు గణేశుని కృప తమ కుటుంబాలపై ఉండాలని ప్రార్థించారు.
కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో విజయకుమారి, ఎమ్మార్వో విఠల్, ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్, ఫ్లోర్ లీడర్ తూము పద్మ శరత్ రెడ్డి దంపతులు, వీడీసీ చైర్మన్ గంగాధర్ రావు పట్వారి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దాము, పట్టణ సీఐ వెంకట నారాయణ, విద్యుత్ శాఖ ఏఈ నాయిని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అలాగే బేతి గంగారాం, తోకల సాయిరెడ్డి, ఏశాల గంగాధర్, ఏశాల రవి, పూజారి లింగం, గుమ్ముల అశోక్ రెడ్డి, సంతోష్ గౌడ్, రవిగౌడ్, బీర్కూర్ బుజ్జి, బాలరాజ్, రుద్ర సత్యనారాయణ, పోశెట్టి, జీవన్ గౌడ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రాకాసిపేట ప్రధాన వీధులు గణేశ నామస్మరణతో మార్మోగాయి. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానికులు సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








