శ్రీ విఘ్నేశ్వర గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం
సాలూర, సెప్టెంబర్ 22: నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంక్ సమీపంలో శ్రీ విఘ్నేశ్వర గణేష్ మండలి ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ముందుగా మండలి సభ్యులు గణనాథుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. చిన్నారులు, మహిళలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా మండలి సభ్యులు మాట్లాడుతూ.. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరి శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో భక్తుల భాగస్వామ్యం, సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కె. సాయినాథ్, జీవన్, ఎం. అజిత్ గౌడ్, ఎం. ప్రశాంత్, ఎం. సాయి ప్రసాద్, కె. రోహిత్, ఎం. నిఖిల్, వై. రిషికేష్, వై. రమేష్ తదితర మండలి సభ్యులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేసి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
“గణనాథుడి సన్నిధిలో భక్తులకు అన్నప్రసాదం.. ఘనంగా శ్రీ విఘ్నేశ్వర గణేష్ మండలి అన్నదానం”
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








