బోధన్, సెప్టెంబర్ 21: బోధన్ పట్టణంలోని ఇందూర్ హైస్కూల్‌లో ఎన్‌సీసీ ‘ఏ’ సర్టిఫికెట్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు సోమవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. నిజామాబాద్‌కు చెందిన 12 (టి) బి ఎన్‌సీసీ సుబేదార్ బల్విందర్ సింగ్ చేతుల మీదుగా పాఠశాల 15వ బ్యాచ్‌కు చెందిన 56 మంది ఎన్‌సీసీ క్యాడెట్లకు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్ మాట్లాడుతూ.. ఎన్‌సీసీ శిక్షణ విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు సమాజం పట్ల బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు.
ఎన్‌సీసీ శిక్షణ ద్వారా పొందిన క్రమశిక్షణ, నాయకత్వ నైపుణ్యాలను విద్యార్థులు భవిష్యత్‌లో విద్యా, ఉద్యోగ రంగాల్లో సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇందూర్ హైస్కూల్‌లో 15వ బ్యాచ్ విద్యార్థులు ఎన్‌సీసీ ‘ఏ’ సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేయడం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు.

క్యాడెట్లకు శిక్షణ అందించిన ఎన్‌సీసీ సెకండ్ ఆఫీసర్ బి. సాయిను ఈ సందర్భంగా అభినందించారు. మరింత మంది విద్యార్థులు ఎన్‌సీసీలో చేరి క్రమశిక్షణ, సేవాభావంతో దేశ సేవకు సిద్ధం కావాలని ఆయన ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఇన్‌చార్జి సారద, ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సర్టిఫికెట్లు అందుకున్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








