ప్రజావాణిలో కుటుంబ సభ్యులతో కలిసి TUCI నాయకుల వినతి…
బోధన్, సెప్టెంబర్ 21:
భిక్నెల్లి గ్రామపంచాయతీలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన బాగారే యాదు, బాగారే బాలాజీ కుటుంబాలకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ TUCI నాయకులు, మృతుల కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం బోధన్ ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.
TUCI జిల్లా సహాయ కార్యదర్శి బి. మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. 2025 సెప్టెంబర్ 11న భిక్నెల్లి గ్రామానికి చెందిన బాగారే యాదు, బాగారే బాలాజీలు రాంపూర్ గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద నుంచి విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్‌పై తరలిస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు. ఘటన అనంతరం మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు తెలిపారు.
అప్పట్లో సంబంధిత అధికారులు, పోలీసు అధికారులు, ఎంపీడీఓ, తహసీల్దార్ తదితరులు కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి సబ్ కలెక్టర్ వద్దకు తీసుకెళ్లినట్లు మల్లేష్ పేర్కొన్నారు. ఆ సందర్భంగా యాదు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రెండు ప్రభుత్వ ప్లాట్లు, రూ.2 లక్షల ఆర్థిక సహాయం, అలాగే బాలాజీ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వ స్థలంలో ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

ఘటనకు ఏడాది పూర్తయినప్పటికీ హామీల అమలు జరగలేదని మల్లేష్ ఆరోపించారు. కుటుంబాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని అప్పట్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో TUCI నాయకులు బి. నాగేశ్వర్, సోన్ కాంబ్లే విట్టల్‌తో పాటు మృతుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







