వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశం.. సర్వే నంబర్ 139/1పై సరిహద్దు వివాదం పరిష్కారానికి చర్యలు…
బోధన్: బోధన్ డివిజన్ పరిధిలోని మూడు మండలాల సరిహద్దులు కలిసే ప్రాంతంలో జరుగుతున్న ఎర్రమట్టి (గ్రావెల్) అక్రమ తవ్వకాలపై బోధన్ డివిజన్ ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. బోధన్ మండలం సంగం, వర్ని మండలం హుమ్నాపూర్, చందూర్ మండలం ఘన్‌పూర్ గ్రామాల సరిహద్దులు కలిసే ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, వాటిని వెంటనే నిలిపివేయించారు.
అనంతరం చందూర్, వర్ని, బోధన్ మండలాల తహసీల్దార్లను సంఘటనా స్థలానికి పిలిపించి, అక్రమ తవ్వకాలకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేయడంతో పాటు నిబంధనల మేరకు కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సర్వే నంబర్ 139/1పై సరిహద్దు వివాదం
అక్రమ తవ్వకాలు జరిగినట్లు గుర్తించిన ప్రాంతం సర్వే నంబర్ 139/1లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వే నంబర్ బోధన్, వర్ని, చందూర్ మండలాల సరిహద్దులు కలిసే ప్రాంతంలో ఉండటంతో భూమి సరిహద్దులకు సంబంధించి వివాదం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మూడు మండలాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆర్డీఓ సంబంధిత DIOS అధికారిని ఆదేశించారు. భూ-భారతి రీ-సర్వే గ్రామసభలో భాగంగా ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆర్డీఓ ఆదేశాల మేరకు కోటగిరి మండలానికి చెందిన DIOS ఏ. దత్తు సమస్యను పరిశీలించి, సంబంధిత సరిహద్దు అంశాన్ని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అక్రమ తవ్వకాలపై అధికారులు తీసుకున్న చర్యలతో పాటు, సర్వే నంబర్ 139/1కు సంబంధించిన సరిహద్దు వివాదం పరిష్కారం ఎలా జరుగుతుందనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







