-- --

బోధన్‌లో హోటళ్లు, బేకరీలపై మున్సిపల్ ఆకస్మిక తనిఖీలు – నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ పట్టణంలో ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాల అమలులో భాగంగా మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల సందర్భంగా పరిశుభ్రత నిబంధనలు పాటించని గాయత్రి టిఫిన్ సెంటర్, అరోమా హోటల్, గణేష్ ఇడ్లీ సెంటర్, ఏషియన్ బేకరీలకు రూ.500 చొప్పున జరిమానా విధించారు. అలాగే నిబంధనల ఉల్లంఘన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బావర్చి హోటల్‌కు రూ.1,000 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ మాట్లాడుతూ, ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయంలో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ప్రజారోగ్యానికి భంగం కలిగించే విధంగా నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ తనిఖీల్లో ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్ (ఐ/సి ఎస్‌ఐ) గణేష్, దత్తారావు తదితర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది… నాణ్యమైన ఆహారమే ప్రజల నమ్మకానికి నిలువు దిక్కు.”

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more