-- --

దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి: పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సీపీఐ (ఎం-ఎల్)

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్‌లో కొమురయ్య చిత్రపటానికి నివాళులు – ప్రభుత్వ విధానాలపై విమర్శలు..

బోధన్, జూలై 4: బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలోని పార్టీ జెండా గద్దె వద్ద శనివారం దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతిని పురస్కరించుకుని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ, నైజాం పాలనలో వెట్టిచాకిరి, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల్లో దొడ్డి కొమురయ్య కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. కడివెండి గ్రామంలో జరిగిన ఘటన అనంతరం తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిందని, ఆ పోరాటం ద్వారా వేలాది ఎకరాల భూములు పేదలకు దక్కే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ప్రస్తుత పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై ఆయన విమర్శలు చేశారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితో ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శంకర్, బి. సాయిలు, గంగారాం, చాంద్, పోశెట్టి లింగం తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ప్రభుత్వ విధానాలపై చేసిన వ్యాఖ్యలు కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలేనని గమనించాలి.

త్యాగంతో వెలిగిన చరిత్ర… పోరాటంతో నిలిచిన ప్రజాస్వామ్యం.”

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more