Post Views: 10
క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వానికి పునాది – సీపీ పి. సాయి చైతన్య ఐపీఎస్.
“క్రీడలో చెమట చిందించినవారే… జీవితంలో విజయ పతాకం ఎగురవేస్తారు.”
నిజామాబాద్, జూలై 3: తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్–2026–27 ప్రారంభోత్సవం శుక్రవారం నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడలు కేవలం శారీరక దారుఢ్యానికే కాకుండా క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, మానసిక దృఢత్వాన్ని పెంపొందించే ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ బాలికలు రాణించాలని, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ప్రతి పోటీలో గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ఆడాలని, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందని సీపీ సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని, విద్యాసంస్థలు క్రీడలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రతిభను నిరూపించుకోవాలని క్రీడాకారిణులకు పిలుపునిచ్చారు.
ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్నగర్, వనపర్తి, వరంగల్ తదితర జిల్లాల నుంచి వచ్చిన బాలికల జట్లు పాల్గొన్నాయి.
కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, డీఎస్వో పవన్ కుమార్, ఎన్డీఎఫ్ఏ అధ్యక్ష సలహాదారు ఎన్. సుధాకర్, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి జావీద్, ఫుట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్లు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారిణులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








