-- --

CEIR పోర్టల్‌తో పోగొట్టుకున్న 6 మొబైల్ ఫోన్ల రికవరీ – యజమానులకు అప్పగించిన బోధన్ రూరల్ పోలీసులు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

మొబైల్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి CEIRలో నమోదు చేసుకోవాలని ప్రజలకు సూచన…

సాంకేతికత సద్వినియోగమైతే… పోయిన ఆస్తి కూడా తిరిగి చేరుతుంది.”

బోధన్, జూలై 3: బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లకు సంబంధించిన ఫిర్యాదులపై పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా విచారణ చేపట్టి మొత్తం 6 మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేశారు. అనంతరం వాటిని సంబంధిత యజమానులకు అప్పగించారు.
ఈ సందర్భంగా బోధన్ రూరల్ ఎస్‌హెచ్‌ఓ మాట్లాడుతూ, ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు CEIR పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. మొబైల్ ఫోన్‌కు సంబంధించిన IMEI నంబర్‌ను ముందుగానే భద్రపరచుకోవడం అత్యంత అవసరమని తెలిపారు.
అలాగే, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు OTPలు, వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సైబర్ వారియర్ విశాల్, బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, మొబైల్ ఫోన్లు తిరిగి పొందిన బాధితులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more