Post Views: 269
రూ.58,490 నగదు, 10 సెల్‌ఫోన్లు, 5 బైక్‌లు స్వాధీనం – చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం తప్పదన్న పోలీస్ కమిషనర్…..
నిజామాబాద్, జూలై 4 (విలేకరి):
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నూత్‌పల్లి గ్రామ సమీపంలోని ఓ గెస్ట్ హౌస్‌పై చీతా ఫోర్స్ బృందం శనివారం మెరుపు దాడి నిర్వహించింది. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏసీపీ మస్తాన్ అలీ పర్యవేక్షణలో చీతా ఫోర్స్ ఈ దాడిని చేపట్టింది. నిందితుల వద్ద నుంచి రూ.58,490 నగదు, 10 సెల్‌ఫోన్లు, 5 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టు చేసిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లు, వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం నందిపేట పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట, జూదం, గుట్కా, మత్తు పదార్థాల విక్రయాలు తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు.
చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







