కల్తీ కల్లు విక్రయంపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్ – నివేదికలు వచ్చిన తర్వాత చర్యలు: ఎక్సైజ్ సీఐ…
బోధన్, జూలై 4:
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట శనివారం పలువురు బాధితులు ధర్నా నిర్వహించారు. తమకు కల్తీ కల్లు విక్రయించారని, దానిని సేవించిన అనంతరం అనారోగ్యానికి గురయ్యామని వారు ఆరోపించారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, కల్తీ కల్లు విక్రయానికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. అలాగే ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు తగిన వైద్య సహాయం అందించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కల్లు విక్రయ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
ఎక్సైజ్ సీఐ స్పందన:
ఈ ఘటనపై స్పందించిన బోధన్ ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ, ఘటనకు సంబంధించి ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం పంపించామని, సంబంధిత నివేదికలు వచ్చిన అనంతరం వాస్తవాలను నిర్ధారించి, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాకు వెల్లడించారు.
“ప్రజల ప్రాణాల కంటే లాభం పెద్దది కాదు… కల్తీపై కఠిన చర్యలే సమాజానికి నిజమైన రక్షణ.”
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







