June 24, 2026 11:15 pm

V1News Telangana

SIR-2026 కోసం బీఎల్‌ఓలకు ఎన్నికల సామగ్రి పంపిణీ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

పారదర్శకంగా ప్రత్యేక సర్వే నిర్వహించాలని ఆర్‌డీఓ విజయకుమారి సూచన…

బోధన్, జూన్ 24:

ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సామగ్రిని బోధన్ నియోజకవర్గంలోని బీఎల్‌ఓలకు అందజేసేందుకు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సంఘం నుంచి బోధన్ నియోజకవర్గానికి కేటాయించిన సామగ్రిని హైదరాబాద్ నుంచి తెప్పించిన ఆర్‌డీఓ శ్రీమతి ఎం. విజయకుమారి, సంబంధిత మండలాల తహసీల్దార్లకు బుధవారం పంపిణీ చేశారు.

ఎన్నికల సంఘం అందజేసిన బీఎల్‌ఓ కిట్ బ్యాగ్‌లో బీఎల్‌ఓల సూచిక, క్యూ‌ఆర్ కోడ్‌లతో కూడిన శిక్షణ బ్రోచర్, ఎగ్జామ్ ప్యాడ్, ఫారమ్-6, 7, 8 డిక్లరేషన్ పత్రాలు, రిజిస్టర్, నోట్‌ప్యాడ్, పెన్నులు, ఫెవిస్టిక్, హైలైటర్, స్టాప్లర్, పిన్నులు, ఎరేజర్, షార్పనర్, పెన్సిల్ బాక్స్, స్కేల్ తదితర సామగ్రి ఉన్నాయి. అదనంగా బీఎల్‌ఓల కోసం సి.ఎఫ్. ఫారాలు, రెయిన్‌కోట్, గొడుగు, టీ-షర్ట్, ఫైల్ ప్యాడ్‌లను కూడా ఎన్నికల సంఘం పంపింది.

ఈ సందర్భంగా ఆర్‌డీఓ విజయకుమారి, బోధన్ తహసీల్దార్ పి. విఠల్‌తో కలిసి బోధన్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల తహసీల్దార్లకు సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో ఎన్నికల సెల్ సిబ్బంది నాగమణి (ఈపీఐసీ-డీటీ), సుశీల (సీనియర్ అసిస్టెంట్), అహ్మదుద్దీన్ (ఆఫీస్ సబ్‌ఆర్డినేట్), ముస్తఫా (ఆపరేటర్) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్‌డీఓ మాట్లాడుతూ, అందజేసిన సామగ్రిని వెంటనే బీఎల్‌ఓలకు పంపిణీ చేసి, ప్రత్యేక సర్వే ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని తహసీల్దార్లకు సూచించారు. శిక్షణ బ్రోచర్‌లో పొందుపరిచిన క్యూ‌ఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా బీఎల్‌ఓలు అవసరమైన మార్గదర్శకాలు, సూచనలను తెలుసుకుని తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి బీఎల్‌ఓ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more