June 24, 2026 11:19 pm

V1News Telangana

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: కల్దుర్కి జెడ్పీహెచ్‌ఎస్‌లో అవగాహన కార్యక్రమం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, జూన్ 24: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో కల్దుర్కి ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్)లో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు.

కార్యక్రమంలో భాగంగా “మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు – యువత భవిష్యత్తుపై ప్రభావం” అంశంపై వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more