June 24, 2026 11:14 pm

V1News Telangana

అంగన్‌వాడి చిన్నారులకు పుస్తకాల పంపిణీ.. విద్యాభివృద్ధికి చేయూత

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంపొందితేనే భావి భారతం బలోపేతం”

బోధన్, జూన్ 24 (వార్తా ప్రతినిధి):

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 15వ వార్డు అంగన్‌వాడి కేంద్రంలో బుధవారం చిన్నారులకు విద్యాపట్ల ఆసక్తి పెంపొందించేందుకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుమ్మల అశోక్ రెడ్డి, షేక్ మిరాజ్, పి. రాజు, మహబూబ్ టైలర్, రవి టీచర్, ఇరిహాన్ తదితరులు పాల్గొని చిన్నారులకు పుస్తకాలు అందజేశారు.

ఈ సందర్భంగా గుమ్మల అశోక్ రెడ్డి మాట్లాడుతూ, చిన్నారులు బాల్యం నుంచే చదువుపై ఆసక్తి పెంపొందించుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యే వ్యక్తిగత వికాసంతో పాటు సమాజ అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

అనంతరం అంగన్‌వాడి ఉపాధ్యాయులు చిన్నారులకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి విద్యార్థి లక్ష్యసాధన దిశగా కృషి చేసి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. విద్యా ప్రోత్సాహక కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more