June 16, 2026 10:54 pm

V1News Telangana

సాలూర పంచాయతీ భవన వివాదం: DLPO ఆదేశాల అమలుపై ప్రశ్నలు.. మళ్లీ వారం రోజుల గడువు..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలూర, Nizamabad:

సాలూర గ్రామ పంచాయతీ భవనానికి సంబంధించిన సమస్య పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. మూడు నెలల క్రితమే డివిజన్ స్థాయి పంచాయతీ అధికారి (DLPO) విచారణ నిర్వహించి వేలం ప్రక్రియ చేపట్టాలని ఆదేశించినప్పటికీ, ఇప్పటి వరకు అమలు కాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలల క్రితమే విచారణ…..

గ్రామస్తుల వివరాల ప్రకారం, పంచాయతీ భవనానికి సంబంధించిన అంశంపై మూడు నెలల క్రితం DLPOకి ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామానికి వచ్చిన డివిజన్ స్థాయి పంచాయతీ అధికారి, సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, కొందరు వార్డు సభ్యులు, కిరాయిదారుల సమక్షంలో విచారణ నిర్వహించారు.

విచారణ అనంతరం భవనానికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం వెంటనే వేలం (ఆక్షన్) ప్రక్రియ చేపట్టాలని ఆదేశించినట్లు గ్రామస్తులు తెలిపారు.

అమలు కాని ఆదేశాలు..

 

అయితే, డివిజన్ స్థాయి పంచాయతీ అధికారి ఆదేశాలు జారీ చేసి మూడు నెలలు గడిచినా స్థానిక పంచాయతీ యంత్రాంగం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆక్షన్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో పాటు, ఆలస్యానికి గల కారణాలపై కూడా అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని వారు పేర్కొన్నారు.

నిలదీయడంతో మళ్లీ గ్రామానికి వచ్చిన DLPO

తమ ఫిర్యాదుపై పురోగతి లేకపోవడంతో గ్రామస్తులు సంబంధిత అధికారులను నిలదీశారు. దీంతో డివిజన్ స్థాయి పంచాయతీ అధికారి ఈరోజు సాలూర గ్రామాన్ని మరోసారి సందర్శించినట్లు సమాచారం.

మూడు నెలల క్రితం ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు కాలేదని గ్రామస్తులు ప్రశ్నించగా, అధికారులు సరైన వివరణ ఇవ్వలేకపోయారని వారు తెలిపారు. ఈ సందర్భంగా, మరో వారం రోజుల్లో సమస్యను పరిష్కరించి తగిన చర్యలు తీసుకుంటామని DLPO హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

> “మూడు నెలల క్రితమే అధికారుల సమక్షంలో విచారణ నిర్వహించి వేలం వేయాలని ఆదేశించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మేము మళ్లీ ప్రశ్నించడంతో ఇప్పుడు వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఈసారి అయినా ఇచ్చిన హామీని అమలు చేయాలి.”

సాలూర గ్రామస్తులుగ్రామస్తుల డిమాండ్…

పంచాయతీ భవన సమస్యపై ఆలస్యం ఎందుకు జరిగిందనే అంశంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

DLPO ఇచ్చిన తాజా గడువులోగా ఆక్షన్ ప్రక్రియ పూర్తవుతుందా….?
లేక మరోసారి కాలయాపన జరుగుతుందా…? అన్నది ప్రస్తుతం సాలూర గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more