బోధన్ లో శ్రామిక వర్గపక్షపాతి శ్రీశ్రీ కి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు..…
బోధన్ జూన్ 16: బోధన్ పట్టణంలోని తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ భవన్ లో మంగళవారం శ్రామిక వర్గపక్షపాతి శ్రీ శ్రీ చిత్రపటానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. గంగాధర్ మాట్లాడుతూ శ్రీ శ్రీ నాడు సమాజంలోని వాస్తవాలకు అక్షరము రూపం ఇచ్చాడని అన్నాడు. తను పదునైన పదాలతో లోతైన భావాలతో స్వార్థపరులు,లంచగొండులు సాటి మనిషి శ్రమను దోచుకునే దుర్మార్గులు, సమ సమాజాన్ని ఒప్పుకొని నీచులకు సింహా స్వప్నం అయ్యాడని, పీడితులు తాడితులు అణగారిన వర్గాలకు మాత్రము అప్తుడయ్యాడని దోపిడీలు దౌర్జన్యాలు ఇకపై చెల్లవని సవాల్ విసిరాడని గుప్పెడు అక్షరాలతో అనంతమైన భావాలు ఆయన రచనల్లో నాట్యమాడుతాయని ఆయన సాహిత్యానికి కన్నీటిని ఉప్పెనగ మార్చే శక్తి, శక్తి హీనులను పోరాటయోధులుగా మార్చే స్ఫూర్తి ఉన్నదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పి. శంకర్, బి. సాయిలు, దేవయ్య, రమేష్,లాలయ్య, గంగాధర్, రాములు తదితరులు పాల్గొన్నారు.







