బోధన్, జూన్ 16: భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా సేవలందించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుడు ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ పేరుపై ప్రత్యేక అర్చనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ బోధన్ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపీకిషన్ మాట్లాడుతూ, మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ దేశానికి సుపరిపాలన అందిస్తూ వ్యవసాయం, ఆర్థికం, రక్షణ, రవాణా తదితర అన్ని రంగాల్లో అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో సమానంగా నిలబెట్టే దిశగా ముందుకు తీసుకెళ్తున్న నాయకత్వం మోదీదేనని అన్నారు.
విశ్వకర్మ యోజన, ముద్ర రుణాలు, ప్రధాని ఆవాస్ యోజన, పీఎం కిసాన్, బేటీ బచావో-బేటీ పడావో, ప్రధాని గ్రామ సడక్ యోజన వంటి పథకాల ద్వారా సామాన్య ప్రజల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. దేశాభివృద్ధి, ప్రజాసేవను లక్ష్యంగా చేసుకుని నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని మోదీ శతాయుష్షుతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని రామభక్త ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొలీపాక బాలరాజు, మాసిని వినోద్, హనుమాన్లు చారి, గుంత గంగాధర్, పేరుక వెంకటేష్, కార్యదర్శి స్వప్నిల్, శ్రీను, వినోద్, వినయ్, పడాల శ్రీను, కిరణ్, పవన్ కళ్యాణ్, శ్రీకాంత్, రాజు, సన్నీ, కనీగంటి ఫణీంద్ర, రాము తదితరులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







