Post Views: 55
నాణ్యమైన విత్తనాల విక్రయంపైనే దృష్టి – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు…
సాలూరు, జూన్ 2: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు సాలూర మండలంలో పలు విత్తన విక్రయ కేంద్రాలను మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్వో), మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో) సంయుక్తంగా మంగళవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విత్తనాల నిల్వలు, ధరల పట్టికలు, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు, లైసెన్సులు, నాణ్యత ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు ధృవీకరించబడిన (సర్టిఫైడ్) విత్తనాలనే విక్రయించాలని, ప్రతి విక్రయ కేంద్రంలో ధరలు, నిల్వల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని వ్యాపారులకు సూచించారు.
విత్తనాల కొనుగోలు సమయంలో రైతులకు తప్పనిసరిగా బిల్లులు జారీ చేయాలని, నకిలీ లేదా నాణ్యతలేని విత్తనాల విక్రయానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విక్రయాలకు సంబంధించిన అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో గుర్తింపు పొందిన విక్రయ కేంద్రాల నుంచే కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని అధికారులు సూచించారు. విత్తనాల నాణ్యత లేదా విక్రయాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని కోరారు.
ఈ తనిఖీల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చూడడంతో పాటు, నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832









