June 2, 2026 10:58 pm

V1News Telangana

అక్రమ మొరం తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

జేసీబీతో పాటు ఐదు ట్రాక్టర్లు స్వాధీనం – అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసుల హెచ్చరిక..

నిజామాబాద్, జూన్ 1:

అక్రమ మొరం తవ్వకాలు, సహజ వనరుల అక్రమ రవాణాపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక దృష్టి సారించింది. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ ఇన్‌చార్జ్ మస్తాన్ అలీ పర్యవేక్షణలో చీతా ఫోర్స్ బృందం సోమవారం కమ్మర్‌పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామ శివారులో మెరుపు దాడి నిర్వహించింది.

విశ్వసనీయ సమాచారం ఆధారంగా కాడి చెరువు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన చీతా ఫోర్స్ సిబ్బంది అక్కడ అక్రమంగా మొరం తవ్వి తరలిస్తున్న కార్యకలాపాలను గుర్తించారు. ఈ సందర్భంగా మొరం తవ్వకాల కోసం వినియోగిస్తున్న ఒక జేసీబీ యంత్రంతో పాటు మొరాన్ని రవాణా చేస్తున్న ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి విచారణ, చట్టపరమైన చర్యల నిమిత్తం కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో అక్రమ మొరం, ఇసుక, మట్టి తవ్వకాలు మరియు రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ సహజ వనరులను అక్రమంగా దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more