Post Views: 102
ఆర్డీవో విజయకుమారి ఆదేశాలతో సరిహద్దు ప్రాంతాల్లో సర్వే ప్రారంభం..
నిన్నటి వార్తపై తక్షణ స్పందన.. వాస్తవాలు వెలుగులోకి వస్తాయా?
సాలూర్, జూన్ 2 (ప్రతినిధి):
సాలూర్–బోధన్ మార్గంలో అక్రమ ఇసుక రవాణాపై వెలువడిన వార్తకు రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఆర్డీవో విజయకుమారి సంబంధిత అధికారులకు వెంటనే విచారణ చేపట్టి వాస్తవ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం.
ఆర్డీవో ఆదేశాల మేరకు సాలూర్ మండల తహసీల్దార్ పర్యవేక్షణలో మంగళవారం రెవెన్యూ అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. హుంసా, ఖాజాపూర్, మందర్న, తెగ్గెల్లి తదితర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు, రవాణా మార్గాలు, రీచ్‌ల పరిస్థితులను పరిశీలించినట్లు తెలిసింది.
గత కొంతకాలంగా ఈ ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణాపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, ఇటీవల వెలుగులోకి వచ్చిన అంశాల నేపథ్యంలో అధికారులు సర్వే నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సర్వే సందర్భంగా అధికారులు భౌగోళిక పరిస్థితులు, రవాణా మార్గాలు, ఇసుక నిల్వలపై వివరాలు సేకరించినట్లు సమాచారం.
అయితే ఈ సర్వేలో అధికారులు గుర్తించిన అంశాలు ఏమిటి? అక్రమ రవాణాపై వచ్చిన ఆరోపణల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? అనే విషయాలపై అధికారిక నివేదిక వెలువడాల్సి ఉంది.
ప్రస్తుతం ప్రజల దృష్టి మొత్తం ఈ సర్వే ఫలితాలపైనే ఉంది. క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలనల ఆధారంగా అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అక్రమాలు ఉన్నట్లు తేలితే ఎలాంటి చర్యలు ఉంటాయి? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
నిన్నటి వార్తపై అధికార యంత్రాంగం స్పందించడం స్వాగతించదగ్గ పరిణామమే అయినప్పటికీ, సర్వే ఫలితాలు, తదుపరి చర్యలే ఈ వ్యవహారంలో కీలకంగా మారనున్నాయి. అధికారులు సమగ్ర నివేదికను ప్రజల ముందుంచి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832









