June 2, 2026 10:58 pm

V1News Telangana

సాలూర మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ – అమరవీరుల త్యాగాలకు నివాళి..

బోధన్, జూన్ 2:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలూర మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల కార్యాలయంలో తహసీల్దార్ నవాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సభ్యురాలు లావణ్య రవి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీవో నరసయ్య, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ చైర్మన్ అల్లే జనార్ధన్, రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి (ఏఓ) శ్వేత జాతీయ పతాకాన్ని ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వ్యవసాయం, సాగునీటి రంగం, విద్య, వైద్యం, మౌలిక వసతులు మరియు సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.
తెలంగాణను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more