June 2, 2026 10:59 pm

V1News Telangana

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు – క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

హెడ్‌క్వార్టర్స్, అమరవీరుల స్థూపం వద్ద ఏర్పాట్ల పరిశీలన – భద్రత, ట్రాఫిక్, సౌకర్యాలపై అధికారులకు సూచనలు..

నిజామాబాదు, జూన్ 1 (వి1 న్యూస్): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సోమవారం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయం (హెడ్‌క్వార్టర్స్)తో పాటు అమరవీరుల స్థూపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

వేడుకల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించిన కమిషనర్ వేదిక నిర్మాణం, అతిథుల కూర్చునే ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, విద్యుత్ సదుపాయాలు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమ ప్రాంగణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు అమలు చేయాలని ఆదేశించారు.

అనంతరం అమరవీరుల స్థూపాన్ని సందర్శించిన ఆయన అక్కడ కొనసాగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించే కార్యక్రమాన్ని గౌరవప్రదంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్థూపం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, టౌన్-4 ఎస్‌హెచ్‌వో సతీష్, నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ వి. అనిల్ గిరిధర్, సాయిలు తదితర అధికారులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more