May 19, 2026 10:07 am

V1News Telangana

10:45దాటినా తలుపులే తెరచి… అధికారులు గైర్హాజరు!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలూర పంచాయతీ కార్యాలయంలో పరాకాష్టకు చేరిన నిర్లక్ష్యం – ప్రజలు గంటల తరబడి నిరీక్షణ..

 

సాలూర, మే 18:
సాలూర గ్రామపంచాయతీ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది. ప్రభుత్వ కార్యాలయం ఉదయం నుంచే ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉండగా, ఉదయం 10:45 గంటలు దాటినా కార్యాలయంలో ఒక్క అధికారి గానీ, సిబ్బంది గానీ కనిపించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కార్యాలయంలో ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనమివ్వగా, పనుల కోసం వచ్చిన ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.

జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ మరియు నివాస ధృవీకరణల కోసం, అలాగే ప్రభుత్వ పథకాల దరఖాస్తుల నిమిత్తం పలువురు గ్రామస్తులు తెల్లవారుజామునే కార్యాలయానికి చేరుకున్నారు. అయితే గంటలు గడుస్తున్నా ఎవరూ హాజరు కాకపోవడంతో ప్రజలు కార్యాలయం బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ,

“పనులు మానుకుని దూర ప్రాంతాల నుంచి వస్తే, కార్యాలయంలో కనీసం స్పందించే సిబ్బంది కూడా లేకపోవడం దారుణం. ప్రజాసేవ చేయాల్సిన అధికారులు సమయపాలనను పూర్తిగా విస్మరించడం బాధాకరం,”
అని మండిపడ్డారు.

ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన కార్యాలయమే నిర్లక్ష్యానికి కేంద్రంగా మారడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, విధులకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుని, కార్యాలయ పనితీరును గాడిలో పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more