దూపల్లి గ్రామంలో వికలాంగుల సమస్యలపై సర్వే నిర్వహణ
రెంజల్ మండలం, దూపల్లి గ్రామంలో ఆదివారం వికలాంగుల సమస్యలను తెలుసుకునేందుకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) ఆధ్వర్యంలో సర్వే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సమావేశానికి కర్లం గంగాధర్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా NPRD నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల గంగాధర్ మాట్లాడుతూ గ్రామంలో సుమారు 70 మంది వికలాంగులు ఉన్నప్పటికీ వారికి ఉపాధి హామీ పనులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు ఫీల్డ్ అసిస్టెంట్, ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. వెంటనే వికలాంగులకు ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే అంతోదయ రేషన్ కార్డులు మంజూరు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.6,000 పెన్షన్‌ను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.300 పెన్షన్‌ను రూ.5,000కు పెంచాలని, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి వికలాంగులకు నెలకు రూ.11,000 పెన్షన్ అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇల్లు లేని వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలు అందించి మొత్తం రూ.10 లక్షల ఆర్థిక సహాయం కల్పించాలని కోరారు. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు నామినేటెడ్ పోస్టుల రూపంలో 5 శాతం ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గాండ్ల రాజు, కర్లం గంగాధర్, గోగు నవీన్, కోశాధికారి పులి మల్లయ్య, గోగు రాములు, సాయి, పోతరాజు నరేష్, మమ్మాయి గంగయ్య, ధనూరి సాయిలు, కమిటీ సభ్యులు ఆలూరు గంగారెడ్డి, యాటల మహేష్, ఆలూరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







