నిజామాబాద్ జిల్లా సాలూర మండల పరిధిలోని తెగ్గెల్లి గ్రామం మంజీరా పరివాహక ప్రాంతంలోని ఇసుక రీచ్ నుంచి ట్రాక్టర్ల ద్వారా ప్రజలకు ఇసుక సరఫరా నిరంతరంగా కొనసాగించనున్నట్లు మండల తహసీల్దార్ అజ్మత్ నవాజ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “మన ఇసుక – మన వాహనం” పథకం కింద ఈ సేవలు 2026 మే 8వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.

ప్రజలు ప్రభుత్వ అధికారిక యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకుని ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ పథకం ద్వారా మధ్యవర్తుల జోక్యం లేకుండా పారదర్శకంగా ఇసుక సరఫరా జరుగుతుందని స్పష్టం చేశారు. యాప్‌లో బుకింగ్ చేసిన వారికి నిర్ణీత సమయంలోనే ఇసుకను వారి ఇళ్ల వద్దకు ట్రాక్టర్ల ద్వారా చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇసుక సరఫరా ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు గమనించినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








