May 6, 2026 4:45 pm

V1News Telangana

రైతు ఆదాయం తగ్గకుండా పంట మార్పిడి అవసరం రైతు వారోత్సవాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచనలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

రైతు ఆదాయం తగ్గకుండా పంట మార్పిడి అవసరం
రైతు వారోత్సవాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచనలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట రైతు వేదికలో రైతు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ ఎమ్మెల్యే Pocharam Srinivas Reddy ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల ఆదాయం తగ్గకుండా ఉండేందుకు పంట మార్పిడి విధానంపై వ్యవసాయ అధికారులు రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచాలని రైతులకు పిలుపునిచ్చారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు భూమి సారవంతత కూడా పెరుగుతుందని తెలిపారు.
అప్పులేని వ్యవసాయం దిశగా రైతులు ముందుకు సాగాలని, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి లాభదాయకమైన సాగు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more