May 6, 2026 6:29 pm

V1News Telangana

రైతుల అభివృద్ధే లక్ష్యం – ప్రజాపాలన ప్రగతి యోజనలో రైతులకు ఘన సన్మానం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి యోజనలో భాగంగా నిర్వహించిన రైతు వారోత్సవ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. వ్యవసాయ శాఖ మరియు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులను సత్కరిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్, వైస్ చైర్మన్ వసంత్ ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బోధన్ వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు ఉదిమిరి లక్ష్మణ్, సాలూర మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శంకర్, అల్లె సాయన్నతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ శంకర్ మాట్లాడుతూ రైతులే దేశానికి వెన్నెముక అని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను అనుసరించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెంచుకోవచ్చని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుంటే రైతులు అధిక లాభాలు పొందగలరని తెలిపారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న పథకాల ప్రయోజనాలను వినియోగించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
ఆయోజకులు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు వ్యవసాయాభివృద్ధికి దిశానిర్దేశం చేసినట్లు పలువురు అభిప్రాయపడ్డారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more