May 8, 2026 4:59 pm

V1News Telangana

బక్రీద్ నేపథ్యంలో సాలూర చెక్‌పోస్ట్‌పై పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

అక్రమ రవాణా, అనుమానాస్పద వాహనాలపై కఠిన నిఘా ఉంచాలని ఆదేశాలు…
నిజామాబాద్, మే 7: బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ రవాణా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గురువారం బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలూర గ్రామ సరిహద్దు చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మూగజీవాలు, వరి ధాన్యం రవాణా అధికంగా సాగుతున్న నేపథ్యంలో చెక్‌పోస్ట్ వద్ద నిర్వహిస్తున్న తనిఖీలను ఆయన పరిశీలించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ రవాణా, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా నిషేధిత పదార్థాలు, అక్రమ నగదు రవాణా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని సూచించారు.
తనిఖీల సమయంలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండి భద్రతా పరికరాలను వినియోగించాలని సూచించారు.
ప్రతి వాహనాన్ని అనుమానాస్పద కోణంలో పరిశీలిస్తూ అవసరమైతే సాంకేతిక పరికరాల సహాయంతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని, రిఫ్లెక్టర్ జాకెట్లు ధరించడం, ట్రాఫిక్ నియంత్రణలో సమన్వయంతో వ్యవహరించడం అవసరమని పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో చెక్‌పోస్టులు కీలక పాత్ర పోషిస్తాయని కమిషనర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ ఎస్‌ఐ మచ్చేందర్ రెడ్డి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more