April 21, 2026 4:56 pm

V1News Telangana

పోతంగల్ తాసిల్దార్ కార్యాలయంలో నిర్లక్ష్యం… సిబ్బంది గైర్హాజరు, ప్రజలు ఎదురుచూపులు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమవుతోంది. ఇటీవల కొత్తగా తాసిల్దార్ బాధ్యతలు చేపట్టినప్పటికీ, కార్యాలయ నిర్వహణలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రతిరోజూ ఉదయం 10 గంటల తర్వాత కార్యాలయంలో పరిస్థితి అసహజంగా మారుతోంది. ఉదయం 10:05 గంటల సమయంలో ఇద్దరు అటెండర్లు మాత్రమే కార్యాలయంలో కనిపించగా, 10:30 గంటల తర్వాత భూషణం అనే ఒక సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నట్లు గుర్తించారు. మిగతా సిబ్బంది గైర్హాజరుతో ప్రజలు తమ పనుల కోసం కార్యాలయానికి వచ్చి, అధికారుల రాక కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ విషయంపై తాసిల్దార్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా, ఉదయం 10:30 గంటల వరకు సిబ్బంది అందరూ కార్యాలయంలో ఉండాల్సి ఉంటుందని, ఎవరైనా ఒకరు తప్పకుండా ఉంటారని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉండటం గమనార్హం.
అంతేకాకుండా, కార్యాలయంలో ఎవరూ లేకపోయినా లైట్లు వెలిగుతూ, ఫ్యాన్లు తిరుగుతూ ఉండటం వల్ల విద్యుత్తు వృథా అవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ కుర్చీలు, పనిలేని వాతావరణం కార్యాలయ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతున్నాయని అంటున్నారు.
ప్రజలకు సేవలందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరమని, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సిబ్బంది హాజరు, కార్యాలయ నిర్వహణపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more