April 17, 2026 2:20 am

V1News Telangana

సింగ్‌నగర్‌లో రేషన్ బియ్యం దందా: పేదల బియ్యం పక్కదారి..*

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

*సింగ్‌నగర్‌లో రేషన్ బియ్యం దందా: పేదల బియ్యం పక్కదారి..*

విజయవాడ నగరంలోని అజిత్ సింగ్‌నగర్ ప్రాంతం అక్రమ రేషన్ బియ్యం రవాణాకు ప్రధాన కేంద్రంగా మారుతోంది.

రేషన్ కార్డుదారుల వద్ద నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి, వాటిని పాలిష్ పట్టించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాల ఆగడాలు మితిమీరుతున్నాయి.

విజయవాడ నగరంలో ‘కోటి’ అనే వ్యక్తి రేషన్ డాన్‌గా ఎదిగినట్లు ఇటీవలి నివేదికలు పేర్కొంటున్నాయి.

వీరితో పాటు నరేంద్ర, రామచంద్రరావు, బాబూజీ వంటి పాత నేరస్తుల పేర్లు కూడా వినపడుతున్నాయి.

పద్ధతి: సింగ్‌నగర్ వంటి జనసాంద్రత గల ప్రాంతాల్లో దళారులు నేరుగా ఇళ్ల వద్దకు వచ్చి ₹10 నుండి ₹15 రూపాయలకు కిలో బియ్యాన్ని సేకరిస్తున్నారు.

ఇలా సేకరించిన బియ్యాన్ని అర్ధరాత్రి వేళల్లో ఆటోలు మరియు టాటా మ్యాజిక్ వాహనాల ద్వారా గోదాములకు తరలిస్తున్నారు.

అధికారుల చర్యలు: ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో 41 కేసులు ఉన్న రేషన్ కింగ్‌పిన్ కాజ సత్యనారాయణ (జయంతి సత్యం) పై పోలీసులు పీడీ (PD) యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇది నగరంలోని ఇతర రేషన్ డాన్లలో వణుకు పుట్టిస్తోంది•

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more