April 17, 2026 2:20 am

V1News Telangana

చిన్న రైతులపై వివక్ష ఆరోపణలు – పొతంగల్ సొసైటీపై ఆగ్రహం, వెంటనే చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలోని సొసైటీ అధికారులు చిన్న రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద రైతులకు ప్రాధాన్యం ఇస్తూ, చిన్న రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

తమ ధాన్యాన్ని కాటా చేయడంలో ఆలస్యం చేయడం, బార్ధన్ సరిగా ఇవ్వకపోవడం, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పించకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని రైతులు తెలిపారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే అధికారులు నిర్లక్ష్యంగా, అవమానకరంగా స్పందిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ఇది కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాకుండా కక్షసాధింపు ధోరణిగా మారిందని, చిన్న రైతులంటే చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితిపై వెంటనే స్పందించి, చిన్న రైతులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి Revanth Reddy గారిని రైతులు కోరుతున్నారు. అలాగే పొతంగల్ సొసైటీ అధికారులపై తగిన చర్యలు తీసుకుని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
⚠️ డిమాండ్:
చిన్న రైతులకు సమాన న్యాయం చేయాలి
ధాన్యం కొనుగోలు వెంటనే పూర్తి చేయాలి
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more