Post Views: 304
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రాంతం, 9వ వార్డులో భూమి కబ్జా వ్యవహారం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. పాండు తరఫున తమ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారని బాధితులు తీవ్రంగా ఆరోపిస్తూ న్యాయం కోసం గళమెత్తుతున్నారు.

మొత్తం 50 మంది బాధితులు ఈ వివాదంలో ఉన్నప్పటికీ, ఇప్పటివరకు కేవలం 7 మందికే పరిష్కారం లభించిందని, మిగతా బాధితులు ఇంకా అధికారుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సారి పోశయ్య, అగమయ్య, గంగవ్వ, పోశెట్టి రాజమణి, గంగారం, గోదావరి, నర్సింహులు, నరసయ్య, ఎల్లమయ్య, ఎల్లవ్వ, శంకర్, శంకరయ్య, సురేష్ తదితరులు తమ భూముల కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తున్నారు.
బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయం సహా పలుమార్లు ఫిర్యాదులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోందని వారు మండిపడ్డారు. సమస్యను పరిష్కరించడంలో విఫలమైతే ఎన్‌ఎఫ్‌సీ కార్యాలయాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
భూమి కబ్జాలు నిరుపేదల జీవనాధారాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయని, ఇది కేవలం భూమి వివాదం కాదని – వారి బ్రతుకుదెరువు సమస్యగా మారిందని స్థానికులు అంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపి అక్రమ కబ్జాలను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
“నిరుపేదల భూములు కబ్జా చేయడం ఆపాలి…
బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి” అంటూ బాధితులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
ఇంకా ఆలస్యం చేస్తే ఈ సమస్య పెద్ద ఎత్తున ఉద్యమంగా మారే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తోంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832











