ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మెగా ఉచిత ఆరోగ్య శిబిరం
పోలీస్ సిబ్బందికి ప్రత్యేక వైద్య పరీక్షలు – కమిషనర్ సాయి చైతన్య సూచనలు
ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం – ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకోండి
నిజామాబాద్, ఏప్రిల్ 07:
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య, ఐపీఎస్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది 24 గంటలు విధులు నిర్వర్తించే నేపథ్యంలో తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. డాక్టర్ల సూచనలు పాటిస్తూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు.
అలాగే సరైన ఆహారపు అలవాట్లు పాటించడం, జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం, తాజా పండ్ల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, డాక్టర్ల సలహాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్‌తో పాటు నగర మేయర్ శ్రీమతి కే. ఉమారాణి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పోలీస్ సిబ్బంది మరియు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు.
వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పాల్గొని, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సలహాలు అందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) జి. బస్వారెడ్డి, ఏసీపీ ప్రకాష్, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ పురంధాల, జనరల్ సెక్రటరీ డా. వి. అశోక్, యాక్షన్ కమిటీ చైర్మన్ డా. ఈ. రవీందర్ రెడ్డి, ఐఎంఏ అధ్యక్షుడు డా. విశాల్, మనోరమ హాస్పిటల్ డా. నరసింహ కట్ట తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







