May 15, 2026 8:21 pm

V1News Telangana

మంజీర పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలూర ఇంచార్జ్ తహసిల్దార్ అనూష చర్యలు – 2 ట్రాలీ ఆటోలు, 2 ట్రాక్టర్లు పట్టివేత
బోధన్:
సాలూర మండలంలోని మంజీర పరివాహక ప్రాంతంలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. సాలూర మండల ఇంచార్జ్ తహసిల్దార్ అనూష ఆదేశాల మేరకు గత వారం రోజులుగా ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాలీ ఆటోలు, 2 ట్రాక్టర్లను అధికారులు పట్టుకుని తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు. పట్టుబడిన వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుని జరిమానాలు విధించనున్నట్లు తహసిల్దార్ తెలిపారు.
అనుమతులు లేకుండా ఇసుక తరలింపును ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఆమె స్పష్టం చేశారు. అక్రమ రవాణా కారణంగా ప్రయాణికులు, స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఇసుక రవాణా విషయంలో ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని, చట్ట విరుద్ధ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు రెవెన్యూ శాఖ కట్టుబడి ఉందని ఇంచార్జ్ తహసిల్దార్ అనూష హెచ్చరించారు
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more