May 14, 2026 4:30 pm

V1News Telangana

బోధన్‌లో గంజాయి సరఫరాదారు అరెస్ట్ కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో ఈగల్ టీం, పోలీసుల సంయుక్త దాడి – 110 గ్రాముల గంజాయి స్వాధీనం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ పట్టణంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బోధన్ టౌన్ పోలీసులు మరియు ఈగల్ RNCC టీం సంయుక్తంగా చేపట్టిన చర్యల్లో భాగంగా, నాందేడ్‌కు చెందిన గంజాయి సరఫరాదారు మీర్జా జుబేర్ బెగ్‌ను గురువారం కొత్త బస్టాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అందిన విశ్వసనీయ సమాచారంతో జుబేర్‌ను పట్టుకొని విచారించగా, ఈ నెల 11న గంజాయి కేసులో అరెస్ట్ై ప్రస్తుతం జైలులో ఉన్న దనుష్‌కు, అలాగే బోధన్‌లోని మరికొంతమందికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. నాందేడ్‌లో దనుష్‌కు 1 కిలో 660 గ్రాముల గంజాయిని విక్రయించినట్లు విచారణలో తేలింది.
ఈ క్రమంలో నిందితుడు జుబేర్ వద్ద నుంచి 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని సీజ్ చేసి, అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసును ఛేదించి నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన బోధన్ టౌన్ SHO వి. వెంకట నారాయణ, ఎస్‌ఐ హబీబ్ ఖాన్, సిబ్బంది కె. మహేష్, గంగా రామ్, ఎ. వరుణ్‌తో పాటు ఈగల్ RNCC టీం నిజామాబాద్ ఇన్‌స్పెక్టర్ పూర్ణేశ్వర్ మరియు వారి సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
గంజాయి విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు
బోధన్ పట్టణంలో ఎవరైనా గంజాయి కొనుగోలు, విక్రయం లేదా వినియోగం వంటి నిషేధిత కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
గంజాయి సంబంధిత సమాచారం తెలిసిన వారు 1908 హెల్ప్‌లైన్‌కు లేదా వాట్సాప్ నంబర్ 87126 71111 కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు పేర్కొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more

1. గుట్కాపై చీత ఫోర్స్ దాడులు 2. మహారాణా ప్రతాప్ జయంతి ఘనంగా 3. ఉపాధి కోసం వెళ్ళిన వారిపై అప్రమత్తత 4. ఈత చెట్లు విధ్వంసంపై గీత కార్మికుల ఆవేదన 5. రైతు సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ 6. “మన ఊరు – మన భద్రత” అవగాహన కార్యక్రమం

Read more

1. గుట్కాపై చీత ఫోర్స్ దాడులు 2. మహారాణా ప్రతాప్ జయంతి ఘనంగా 3. ఉపాధి కోసం వెళ్ళిన వారిపై అప్రమత్తత 4. ఈత చెట్లు విధ్వంసంపై గీత కార్మికుల ఆవేదన 5. రైతు సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ 6. “మన ఊరు – మన భద్రత” అవగాహన కార్యక్రమం