May 13, 2026 11:54 pm

V1News Telangana

అంతరాష్ట్ర చెక్‌పోస్టులో ఆకస్మిక తనిఖీ – అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటాం : బోధన్ ఏసీపీ శ్రీనివాస్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, బుధవారం:
అంతరాష్ట్ర సరిహద్దుల గుండా జరిగే అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసు సిబ్బందికి ఆయన ఆదేశించారు.

బుధవారం సాయంత్రం మండల పరిధిలోని సాలూర అంతరాష్ట్ర చెక్‌పోస్టును ఏసీపీ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న వాహనాల తనిఖీ ప్రక్రియను స్వయంగా పరిశీలించి, చెక్‌పోస్టు రికార్డులను తనిఖీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి అక్రమంగా గోవులను తరలించే అవకాశం ఉన్నందున ప్రత్యేక నిఘా కొనసాగించాలని సూచించారు. అలాగే వరిధాన్యం అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
చెక్‌పోస్టు మీదుగా ప్రయాణించే లారీలు, ఇతర రవాణా వాహనాలను నిశితంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద పరిస్థితులు గుర్తించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సిబ్బందికి సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్సై మచ్చేందర్ రెడ్డి, ఏఎస్సై ప్రశాంత్ రెడ్డి, పోలీసు సిబ్బంది దినేష్, మనోజ్, గంగాధర్, శ్రావణ్, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more

1. గుట్కాపై చీత ఫోర్స్ దాడులు 2. మహారాణా ప్రతాప్ జయంతి ఘనంగా 3. ఉపాధి కోసం వెళ్ళిన వారిపై అప్రమత్తత 4. ఈత చెట్లు విధ్వంసంపై గీత కార్మికుల ఆవేదన 5. రైతు సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ 6. “మన ఊరు – మన భద్రత” అవగాహన కార్యక్రమం

Read more

1. గుట్కాపై చీత ఫోర్స్ దాడులు 2. మహారాణా ప్రతాప్ జయంతి ఘనంగా 3. ఉపాధి కోసం వెళ్ళిన వారిపై అప్రమత్తత 4. ఈత చెట్లు విధ్వంసంపై గీత కార్మికుల ఆవేదన 5. రైతు సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ 6. “మన ఊరు – మన భద్రత” అవగాహన కార్యక్రమం