Post Views: 50
“ఉన్నత వర్గాలకు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా?” అంటూ నిరసన
బోధన్, మే 14 :
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) ఆధ్వర్యంలో గురువారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి మాట్లాడుతూ, బండి సాయి భగీరథ్ కేంద్ర మంత్రికి కుమారుడు కావడం వల్లే అరెస్టులో ఆలస్యం జరుగుతోందని ఆరోపించారు. కేసులో సెక్షన్లు మార్పులు చేసి బెయిల్‌కు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని విమర్శించారు.

ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన న్యాయం జరగాలని, అయితే ఈ కేసులో మాత్రం ఆ న్యాయం కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ బాలిక కుటుంబానికి అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు బీపాషా బేగం, కళావతి, లక్ష్మి, సాయవ్వ, రెహానా బేగం, శోభ, సుగుణ, రాణి, గంగామణి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








