May 15, 2026 9:27 pm

V1News Telangana

Chhatrapati Shivaji Maharaj జయంతి వేడుకలు ఘనంగా

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

జయంతి వేడుకలు ఘనంగా

ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో ఉత్సాహంగా నిర్వహణ

ముధోల్ మండలం ఎడ్బిడ్ గ్రామంలో స్వరాజ్య స్థాపకుడు, మహా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, హిందూ వాహిని, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ కార్యకర్తలు, అలాగే ముధోల్ తాలూకా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి కె. గురు ప్రసాద్ యాదవ్ ముధోల్ నియోజకవర్గ ప్రజలందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, సమర్థ పరిపాలన, దూరదృష్టి ప్రతి భారతీయుడికి ఆదర్శమని పేర్కొన్నారు. యువత ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి పొందుతూ సమాజ సేవలో ముందుండాలని ఆకాంక్షించారు. శివాజీ మహారాజ్ ఆశయాలు, విలువలు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని కోరారు.

ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ జెండాను ఆవిష్కరించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ ఉదయ్ కుమార్, అశోక్, చంద్ర, దేవుడు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సాదుల ప్రభాకర్, ఎస్.కె. ఇస్మాయిల్, శివాజీ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ముధోల్ తాలూకా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి కె. గురు ప్రసాద్ యాదవ్ జయంతి సందేశాన్ని అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more